ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

శ్రావణ మాసంలోనే దుర్గగుడిలో నూతన ప్రసాద భవనాల ప్రారంభం

లడ్డూ ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనాల ప్రారంభానికి వేగంగా ఏర్పాట్లు. ఈవో శీనా నాయక్ అధ్యక్షతన అధికారులతో సమీక్షా సమావేశం. ముహూర్తం ఖరారైన వెంటనే ప్రారంభోత్సవ తేదీని ప్రకటించనున్న దేవస్థానం

V10TV న్యూస్ డెస్క్ 7 ఆగస్టు, 2026 5:33 PMకి 1 వీక్షణలు
శ్రావణ మాసంలోనే దుర్గగుడిలో నూతన ప్రసాద భవనాల ప్రారంభం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

V10 TV | విజయవాడ

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన నూతన ప్రసాదం పోటు (లడ్డూ తయారీ కేంద్రం), అన్నప్రసాద భవనాల ప్రారంభోత్సవానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. శ్రావణ మాసం మొదటి లేదా రెండో వారంలో ఈ భవనాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

ఈ నేపథ్యంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ అధ్యక్షతన శుక్రవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంజినీరింగ్, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాద విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రారంభోత్సవానికి ముందే అన్ని పనులను పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు.

ప్రారంభోత్సవ సమయానికి యంత్రాల పనితీరు, విద్యుదీకరణ, మౌలిక వసతులు, ప్రసాదాల తయారీ ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా సిద్ధంగా ఉండేలా విభాగాల వారీగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

వేద పండితులు నిర్ణయించే శుభ ముహూర్తం ఖరారైన వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతితో ప్రారంభోత్సవ తేదీని అధికారికంగా ప్రకటిస్తామని ఈవో శీనా నాయక్ తెలిపారు. శ్రావణ మాసంలో భక్తులకు నూతన భవనాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మగ్గంపై చంద్రబాబు చిత్రపటం.. చేనేత దంపతుల అరుదైన కానుక

48 నిమిషాల క్రితం 1

డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలి: అన్నవరపు ఎలిజబెత్ రాణి

54 నిమిషాల క్రితం 1

వీఎంసీ మొబైల్ కోర్టు తనిఖీలు.. 23 మందికి జరిమానా

1 గంట క్రితం
2

చీరాల–సూర్యలంక చూస్తే.. ఏపీలోనే మరో గోవా కనిపిస్తుంది: సీఎం చంద్రబాబు

1 గంట క్రితం 2