శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల ముమ్మరం
▪️ శ్రీశైలానికి 2.32 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో... ▪️ విద్యుత్ ఉత్పత్తితో పాటు 66 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల... ▪️ నాగార్జునసాగర్‌కు పెరుగుతున్న వరద ప్రవాహం...

శ్రీశైలం: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి సుమారు 2.32 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో ఉన్న ఏపీ, తెలంగాణ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హెచ్ఎన్ఎస్ఎస్, తెలంగాణ సరఫరా అవసరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం సుమారు 66 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండటంతో ఆ ప్రవాహం నాగార్జునసాగర్‌కు చేరుతోంది.

