పోలీస్స్టేషన్కే ముంపు ముప్పు
నీట మునిగిన టూ టౌన్ పోలీస్స్టేషన్ ప్రాంగణం.. విధుల నిర్వహణకు ఆటంకం.. ఫిర్యాదుదారుల అవస్థలు.. అధ్వాన డ్రైనేజీ వ్యవస్థకు అద్దం పడుతున్న దుస్థితి..

విజయవాడ , సెప్టెంబర్ 12 : నగరంలో శనివారం కురిసిన భారీ వర్షానికి టూ టౌన్ పోలీస్స్టేషన్ ప్రాంగణం నీట మునిగింది. వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక స్టేషన్ ఆవరణలో భారీగా నిలిచిపోయింది. దీంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులతోపాటు ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్స్టేషన్కే ముంపు సమస్య తలెత్తడం నగరంలోని అధ్వాన డ్రైనేజీ వ్యవస్థకు అద్దం పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు తక్షణమే నీటిని తొలగించి, భవిష్యత్తులో సమస్య పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

