ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ6, నవంబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

దీపావళి పేరుతో సైబర్ వల.. రూ.2 వేల ఆశ చూపి ఖాతాలకు కన్నం!

ఎయిర్‌టెల్ పేరుతో నకిలీ సందేశాలు పంపుతున్న సైబర్ నేరగాళ్లు... ప్రతి ఒక్కరికీ రూ.2 వేలు అంటూ అనుమానాస్పద లింకుల పంపిణీ... లింకులు తెరిస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక...

V10TV న్యూస్ డెస్క్ 6 నవంబర్, 2026 1:16 PMకి 6,999 వీక్షణలు
దీపావళి పేరుతో సైబర్ వల.. రూ.2 వేల ఆశ చూపి ఖాతాలకు కన్నం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 6 : దీపావళి పండుగను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ పేరుతో ప్రతి ఒక్కరికీ రూ.2 వేలు ఉచితంగా అందిస్తున్నట్లు నకిలీ సందేశాలను ప్రచారం చేస్తున్నారని హెచ్చరికలు వెలువడుతున్నాయి. దీపావళి కానుకగా రూ.2 వేలు పొందవచ్చంటూ సందేశాల్లో అనుమానాస్పద లింకులను పంపిస్తున్నారు. ఈ లింకులకు ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌తో సంబంధం లేదని వైరల్ అవుతున్న హెచ్చరికలో పేర్కొన్నారు. ఇలాంటి లింకులను తెరిచి వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, రహస్య సంకేతాలు నమోదు చేస్తే సైబర్ నేరగాళ్ల చేతికి కీలక సమాచారం చేరే ప్రమాదం ఉంది. తద్వారా ఆర్థిక మోసాలకు గురయ్యే అవకాశం ఉందని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉచిత నగదు, పండుగ బహుమతులు, ప్రత్యేక ఆఫర్ల పేరుతో వచ్చే సందేశాలను నమ్మవద్దని సూచిస్తున్నారు. ఏదైనా ఆఫర్ నిజమో కాదో తెలుసుకోవడానికి సంబంధిత సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా అనువర్తనాన్ని మాత్రమే సంప్రదించాలి. అనుమానాస్పద లింకులను ఇతరులకు పంపించకుండా జాగ్రత్తపడాలి. సైబర్ మోసానికి గురై డబ్బులు కోల్పోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ముత్యాలమ్మ సన్నిధిలో బొండా సిద్ధార్థ ప్రత్యేక పూజలు

34 నిమిషాల క్రితం 6,572

గెలిచినా విజయోత్సవాలు వద్దు!

1 గంట క్రితం 7,844

అత్తారింటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం!

2 గంటల క్రితం 7,466

బోటు ప్రమాదంలో ఏడుగురు జాలర్ల మృతి.. పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం

2 గంటల క్రితం 8,576