ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ30, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

84వ డివిజన్‌లో లబ్బ దుర్గా ఇంటింటి ప్రచారం

సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లతో మమేకం… డివిజన్ అభివృద్ధికే ప్రాధాన్యమంటున్న టీడీపీ అభ్యర్థి… సైకిల్, గాజు గ్లాసు గుర్తులకు ఓటేయాలని అభ్యర్థన…

V10TV న్యూస్ డెస్క్ 30 అక్టోబర్, 2026 6:39 PMకి 4,878 వీక్షణలు
84వ డివిజన్‌లో లబ్బ దుర్గా ఇంటింటి ప్రచారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పాయకాపురం, అక్టోబర్ 30: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 84వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి బలపరిచిన టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి లబ్బ దుర్గా శుక్రవారం విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సూచనల మేరకు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఓటరు జాబితాలతో ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. పేదలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, వృద్ధులకు నెలకు రూ.4 వేల పింఛను, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ వంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. పేద విద్యార్థుల చదువులకు సహాయం, నిరుపేదలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టిఫిన్ బండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. డివిజన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తానని లబ్బ దుర్గా తెలిపారు. కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుపై, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు కోలా శ్రీను, లబ్బ వైకుంఠం, భీమన ఆంజనేయులు, కొరాడ రమణ, బాషా, మెహర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

78వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కనకదుర్గ ఇంటింటి ప్రచారం

17 నిమిషాల క్రితం 6,894

పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు.. కౌంటింగ్‌పై ప్రత్యేక దృష్టి!

1 గంట క్రితం 6,986

సూర్యమణి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

1 గంట క్రితం
5,908

సంక్షేమమే అజెండాగా దాసరి ఉదయ్ శ్రీ ఎన్నికల ప్రచారం

1 గంట క్రితం 4,602