శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య.. కాలేజీపైనే కుటుంబ సభ్యుల ఆరోపణలు.. కలకలం
ఫీజు ఒత్తిడి, అవమానంతో మనస్తాపం చెందినట్లు ఆరోపణ.. కాలేజీ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన.. బాధ్యులపై చర్యలు కోరుతూ డిమాండ్ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు..

కాకినాడలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఘటన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అరవింద్ (17) మృతి ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కాకినాడలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అరవింద్ (17) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఫీజు చెల్లించలేదనే ఒత్తిడి, తోటి విద్యార్థుల ముందు అవమానించడం వంటి కారణాలతో మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు కాలేజీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

