జగన్ పర్యటనకు జనసంద్రం.. దేవరపల్లిలో వైసీపీ శ్రేణుల భారీ స్వాగతం
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం యువత, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్న ర్యాలీ పర్యటనతో జిల్లా రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన చర్చలు

దేవరపల్లి, ఆగస్టు 5 (వి10టివి): తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటనకు భారీ స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు, యువత, విద్యార్థులు తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలు జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. ఈ పర్యటన జిల్లాలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు.

