భట్టి దంపతులకు షర్మిల ఆత్మీయ ఆహ్వానం!
ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులతో షర్మిల భేటీ... కుమార్తె వివాహ శుభలేఖ అందజేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు... వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరుకావాలని ఆహ్వానం...

హైదరాబాద్, అక్టోబర్ 28 : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దంపతులు బుధవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరుతూ భట్టి విక్రమార్క దంపతులకు వివాహ శుభలేఖను అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వివాహ వేడుకకు తప్పక రావాలని షర్మిల దంపతులు ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ భేటీ కుటుంబ శుభకార్య ఆహ్వానానికి సంబంధించినదిగా పేర్కొన్నారు.

