ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం!
ఆదివారం ఉదయం నుంచే కిటకిటలాడిన అమ్మవారి సన్నిధి... సామాన్య భక్తుల దర్శనానికే తొలి ప్రాధాన్యం... రద్దీ నేపథ్యంలో అంతరాలయ దర్శనం నిలిపివేత... క్షేత్రమంతా కలియతిరిగిన ఈవో శీనా నాయక్...

విజయవాడ, నవంబర్ 15: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అంతరాలయ దర్శనాన్ని నిలిపివేసి, సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యం ఇచ్చారు. క్షేత్రమంతా ఈవో విస్తృత తనిఖీలు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ క్షేత్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు. సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తకుండా క్యూలైన్ల నిర్వహణపై ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. క్యూలైన్లలో భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించారు. చంటిపిల్లల తల్లులు, దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. రద్దీ అధికంగా ఉన్నప్పటికీ సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈవో శీనా నాయక్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల పటిష్ఠ బందోబస్తు ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు తరలిరావడంతో వన్‌టౌన్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. వన్‌టౌన్ సీఐ గుణరామ్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, ట్రాఫిక్ పోలీసు అధికారులు సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఘాట్ రోడ్డు, ఆలయ పరిసర ప్రాంతాల్లో రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో భక్తుల దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.పర్యటించారు. ఘాట్ రోడ్డు, కేశఖండనశాల, సామాన్లు భద్రపరిచే కేంద్రం, దుర్గాఘాట్, కనకదుర్గ నగర్, అన్నప్రసాదాల విభాగం, ప్రధాన ఆలయ ప్రాంగణం, మల్లేశ్వరస్వామి ఆలయ మార్గం, మహామండపం తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఆయా విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించారు.

