స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి అధికారుల విస్తృత ఏర్పాట్లు
ఉండవల్లిలో బకింగ్‌హామ్ కెనాల్ వద్ద నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ఈ నెల 13న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ షా ఆధ్వర్యంలో ఏర్పాట్ల పరిశీలన

ఉండవల్లి: బకింగ్‌హామ్ కెనాల్ వద్ద నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రిడ్జిని ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ షా తదితర అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవం అనంతరం బ్రిడ్జి గుండా సీఎం చంద్రబాబు సీడ్ యాక్సెస్ రహదారి మీదుగా అమరావతి వెళ్లనున్న నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

