భరత్ ఇంటి ముట్టడికి యత్నం.. కుప్పంలో ఉద్రిక్తత
డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ర్యాలీ విజయవంతమైందంటూ ఆ పార్టీ నేతల ప్రకటన... ఎమ్మెల్సీ భరత్ ఇంటి ముట్టడికి టీడీపీ నేతలు యత్నించారంటూ వైఎస్సార్సీపీ ఆరోపణ... పోలీసుల సమక్షంలోనే రెచ్చగొట్టే నినాదాలు చేశారని విమర్శలు.. కుప్పంలో ఉద్రిక్తత...

కుప్పం: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీ అనంతరం కుప్పంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ కుప్పం ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ భరత్ నివాసాన్ని ముట్టడించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని వైఎస్సార్సీపీ వర్గాలు ఆరోపించాయి. పోలీసుల సమక్షంలోనే రెచ్చగొట్టేలా నినాదాలు చేశారని పేర్కొన్నాయి. అధికార పార్టీ నేతల వైఖరిపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

