దుర్గమ్మకు రూ.5 లక్షల స్వర్ణ కానుక
విజయవాడ భక్తుడి కుటుంబం సమర్పణ... రూ.5 లక్షల విలువైన 32 గ్రాముల బంగారు లక్ష్మీతాడు... అమ్మవారిపై భక్తితో కానుక అందజేత...

విజయవాడ, సెప్టెంబరు 5 (ఆంధ్రప్రభ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు ఓ భక్తుడి కుటుంబం బంగారు హారాన్ని కానుకగా సమర్పించింది.
పాలకొల్లు మండలం భాగ్యేశ్వరం గ్రామానికి చెందిన వెంకట త్రిమూర్తి సత్యనారాయణ కుటుంబ సభ్యులు అమ్మవారిపై భక్తితో సుమారు రూ.5 లక్షల విలువైన 32 గ్రాముల బరువున్న బంగారు లక్ష్మీతాడును సమర్పించారు.
ఈ బంగారు ఆభరణంలో తెలుసు, ఎరుపు, పచ్చ రాళ్లు పొదిగి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆలయ అధికారులకు ఆభరణాన్ని అందజేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

