రేషన్ కార్డు పోయిందా.. ఇక నో టెన్షన్!
మేరా రేషన్ యాప్‌తో మొబైల్లోనే కార్డు డౌన్లోడ్... దేశంలో ఎక్కడున్నా రేషన్ పొందే సౌకర్యం... కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్ పంపిణీ సమాచారం తెలుసుకునే అవకాశం...

విజయవాడ, నవంబర్ 16: రేషన్ కార్డు పోయినా, చేతిలో లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన మేరా రేషన్ 2.0 యాప్ ద్వారా రేషన్ కార్డును మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం ఉంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులు దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నా తమకు కేటాయించిన రేషన్ సరుకులను పొందవచ్చు. కార్డు డౌన్లోడ్ ఇలా.. ముందుగా మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి మేరా రేషన్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. అనంతరం బెనిఫిషియరీ యూజర్ ఎంపికను ఎంచుకుని ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో ధ్రువీకరణ పూర్తి చేయాలి. లాగిన్ అయిన తర్వాత డౌన్లోడ్ ఎంపిక ద్వారా రేషన్ కార్డును పొందవచ్చు. ఇంటి నుంచే రేషన్ వివరాలు ఈ యాప్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, నెలవారీ రేషన్ కేటాయింపు, గతంలో తీసుకున్న సరుకులు, ఆధార్ అనుసంధాన స్థితి, సమీపంలోని రేషన్ దుకాణాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రేషన్ కార్డు బదిలీ, కుటుంబ వివరాల మార్పులు వంటి సేవలకు సంబంధించిన ఎంపికలు కూడా ఉన్నాయి. అయితే మార్పుల ఆమోదం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు లోబడి ఉంటుంది.

