ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ26, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

74వ డివిజన్‌లో కూటమి గెలుపే లక్ష్యం!

గోపి సాయికుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని బొండా రవితేజ పిలుపు… అమరావతి కాలనీలో ఇంటింటికీ ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం… సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వెల్లడి…

V10TV న్యూస్ డెస్క్ 26 అక్టోబర్, 2026 6:36 AMకి 3,873 వీక్షణలు
74వ డివిజన్‌లో కూటమి గెలుపే లక్ష్యం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 25: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 74వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఆదివారం సాయంత్రం అమరావతి కాలనీలో కూటమి అభ్యర్థి గోపి సాయికుమార్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా రవితేజ పాల్గొన్నారు. స్థానిక ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వృద్ధాప్య పింఛను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకం, అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 29 డివిజన్లలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ముందుకు సాగుతోందన్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 74వ డివిజన్ సమగ్ర అభివృద్ధికి గోపి సాయికుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని బొండా రవితేజ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో డివిజన్ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

‘ఆర్నాబ్’ తుఫానుపై అప్రమత్తంగా ఉండాలి!– ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

15 నిమిషాల క్రితం 0

ఏపీలో నేటి నుంచి ఓటర్ల జాబితా ముద్రణ!

19 నిమిషాల క్రితం 3,574

ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం!

25 నిమిషాల క్రితం 3,987

1వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి పోటు రజిని ప్రచారం

2 గంటల క్రితం 3,311