1వ డివిజన్లో వైసీపీ అభ్యర్థి పోటు రజిని ప్రచారం
ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన కార్పొరేటర్ అభ్యర్థి… ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన… ప్రచారంలో పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు…

పాయకాపురం, అక్టోబర్ 26: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 1వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పోటు రజిని సోమవారం ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఓటర్లను కలిశారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహేశ్వరరెడ్డి, భరత్ తదితరులు పాల్గొన్నారు.

