ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం!
భవనం నుంచి దట్టంగా ఎగిసిపడిన నల్లటి పొగలు… ఘటనా స్థలానికి చేరుకున్న ఆరు అగ్నిమాపక వాహనాలు… షార్ట్ సర్క్యూట్‌తో మంటలు.. అదుపులోకి తెచ్చిన సిబ్బంది…

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర సచివాలయం నార్త్ బ్లాక్ భవనంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. భవనం పైభాగం నుంచి దట్టమైన నల్లటి పొగలు ఎగిసిపడటంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. భవనం పైకప్పుపై వెల్డింగ్ పనులు జరుగుతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ బాయిలర్‌లో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. పార్లమెంట్‌కు వెళ్తున్న సమయంలో నార్త్ బ్లాక్ వెనుక నుంచి పొగలు రావడాన్ని గమనించిన రాజ్యసభ ఎంపీ మిలింద్ దేవ్రా సంబంధిత చిత్రాలను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పంచుకున్నారు.

