ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ17, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ప్రాణం పోసిన ఫోన్ కాల్!

ఆస్తి వివాదంతో మనస్తాపానికి గురైన యువకుడు.. సమయస్ఫూర్తితో స్పందించిన టెలి-మానస్ కౌన్సిలర్ హేమలత.. సకాలంలో చేరుకుని ప్రాణాలు కాపాడిన పోలీసులు..

V10TV న్యూస్ డెస్క్ 16 నవంబర్, 2026 5:46 PMకి 7,557 వీక్షణలు
ప్రాణం పోసిన ఫోన్ కాల్! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 16: ఆస్తి వివాదాలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి సిద్ధమైన 28 ఏళ్ల యువకుడిని టెలి-మానస్ కౌన్సిలర్ హేమలత సమయస్ఫూర్తి, పోలీసుల తక్షణ స్పందన ప్రాణాపాయం నుంచి కాపాడాయి. విజయవాడలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒక ఫోన్ కాల్ యువకుడి ప్రాణాలను నిలబెట్టింది. ఆస్తి వివాదాల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన యువకుడు వడ్డెరేవు బ్రిడ్జి సమీపానికి చేరుకుని టెలి-మానస్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాడు. అతడి మానసిక పరిస్థితిని గుర్తించిన కౌన్సిలర్ హేమలత వెంటనే స్పందించారు. యువకుడితో ఓపికగా మాట్లాడి ధైర్యం చెప్పడంతోపాటు వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీకాంత్ సలహా తీసుకున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించి వెంటనే 100కు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని సురక్షితంగా రక్షించారు. అనంతరం అతడికి అవసరమైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కౌన్సిలర్ హేమలత, తక్షణమే స్పందించిన పోలీసుల సమన్వయం ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టింది. మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి సరైన సమయంలో అందే కౌన్సిలింగ్, భరోసా ఎంత ముఖ్యమో ఈ ఘటన చాటిచెప్పింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు!

4 గంటల క్రితం 6,984

అమిత్ షా పర్యటన వేళ.. డ్రోన్లకు నో ఎంట్రీ!

6 గంటల క్రితం 7,166

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం!

6 గంటల క్రితం 6,483

కార్తీక దీపాల వెలుగులో శివాలయాల శోభ!

7 గంటల క్రితం 7,288