మెరుగైన వైద్యం కోసం రూ.13.33 లక్షల ఎల్‌ఓసీలు
ఇద్దరి మెరుగైన వైద్యం కోసం రూ.13.33 లక్షల ఎల్‌ఓసీలు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో బాధితులకు పత్రాల అందజేత త్వరితగతిన వైద్యసాయం మంజూరుపై కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ఇద్దరు హృద్రోగ బాధితులకు రూ.13.33 లక్షల విలువైన ఎల్‌ఓసీలు మంజూరయ్యాయి. భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో కూటమి నేతలు బాధిత కుటుంబాలకు ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు. కొత్తపేటకు చెందిన గంధా నూకారత్నం (49) హృద్రోగంతో బాధపడుతూ వైద్యసాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.6.50 లక్షల విలువైన ఎల్‌ఓసీ మంజూరైంది. అలాగే

ఊర్మిళానగర్‌కు చెందిన ఎన్. వెంకటరమణ (45) హృద్రోగ శస్త్రచికిత్స కోసం దరఖాస్తు చేసుకోగా రూ.6.83 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది. వైద్యసాయం కోసం చేసిన విజ్ఞప్తిపై త్వరితగతిన స్పందించి ఎల్‌ఓసీలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలు బొల్లేపల్లి కోటేశ్వరరావు, మొరబోయిన రాంబాబు, పగడాల కృష్ణ, ఈగల సాంబశివరావు, బెన్నా భక్తుల సోమేశ్వరరావు, జయ బాలన్, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
