ఇంటింటికీ కూటమి విజయాల ప్రచారం
♦ విజయవాడ 13వ డివిజన్‌లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం... ♦ ప్రభుత్వ రెండేళ్ల ప్రగతి, సంక్షేమ పథకాలను వివరించిన పట్టాభిరామ్, ఎమ్మెల్యే గద్దె.... ♦ కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ: తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం’ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ రావు సోమవారం 13వ డివిజన్‌లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన స్త్రీశక్తి, తల్లికి వందనం, పింఛన్ల పెంపు, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ప్రభుత్వ విజయాలు, వివిధ వర్గాల సంక్షేమానికి విడుదల చేసిన నిధుల వివరాలతో కూడిన ప్రచార పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, కష్టపడిన ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ముమినేని ప్రసాద్, టీడీపీ నేత గద్దె ప్రసాద్, ఉపాధ్యాయ సంఘ నాయకుడు చలసాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
