బ్రాహ్మణ వీధి వెంకన్న ఆలయ చైర్మన్‌గా చీపుళ్ల వెంకటేశ్వరరావు
బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌గా చీపుళ్ల వెంకటేశ్వరరావు… గతంలో వన్‌టౌన్ పాత శివాలయం ధర్మకర్తగా సేవలు… పాలక మండలి ధర్మకర్తగా భాజపా సీనియర్ నాయకుడు కిలారు శ్రీను…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబరు 1: వన్‌టౌన్ బ్రాహ్మణ వీధిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చీపుళ్ల వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఆలయ పాలన, ధార్మిక కార్యక్రమాల్లో ఆయనకు గత అనుభవం ఉంది. 2003లో వన్‌టౌన్ పాత శివాలయం పాలక మండలి చైర్మన్‌గా చుంచు మాలాద్రి వ్యవహరించిన సమయంలో చీపుళ్ల వెంకటేశ్వరరావు ధర్మకర్తగా సేవలందించారు. తాజాగా శ్రీ

వెంకటేశ్వరస్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా ఆయనకు అవకాశం లభించింది. ఈ కమిటీలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కిలారు శ్రీను ధర్మకర్తగా నియమితులయ్యారు. జనసంఘ్ కాలం నుంచి ప్రజా జీవితంలో కొనసాగుతున్న ఆయన జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకుడిగానూ సేవలందించారు. అనుభవజ్ఞులకు పాలక మండలిలో చోటు దక్కడంపై భక్తులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

