ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ23, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

బెజవాడ తూర్పులో కూటమి ప్రచార జోరు!

తొమ్మిది డివిజన్లలో ఇంటింటికీ ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె, వంగవీటి రాధా... నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్న కేశినేని శివనాథ్... తూర్పులో 26 డివిజన్లలో వైసీపీ నుంచి సరైన పోటీ లేదన్న గద్దె రామమోహన్...

V10TV న్యూస్ డెస్క్ 23 అక్టోబర్, 2026 7:09 PMకి 4,135 వీక్షణలు
బెజవాడ తూర్పులో కూటమి ప్రచార జోరు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 23: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో కూటమి నాయకులు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశారు. శుక్రవారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని 10, 11, 12, 14, 17, 18, 19, 20, 21 డివిజన్లలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు. నగర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరిస్తూ ప్రచారం సాగించారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు: కేశినేని ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మరికొన్ని ప్రాజెక్టులు టెండర్ల దశలో ఉన్నాయని చెప్పారు. విజయవాడ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 26 డివిజన్లలో సరైన పోటీ లేదు: గద్దె ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో కూటమి పార్టీల నాయకులంతా సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని 29 డివిజన్లలో 26 చోట్ల వైసీపీ నుంచి తమ అభ్యర్థులకు సరైన పోటీ లేదని వ్యాఖ్యానించారు. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో పాటు కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారానికి ప్రజల స్పందన: వంగవీటి రాధా మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు. నగరాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకుడు బొప్పన భవకుమార్, కార్పొరేటర్ అభ్యర్థులు భాగం సాయిప్రసాద్, కలపాల శ్రీప్రియ, చెన్నుపాటి కాంతిశ్రీ, గరికపాటి బద్రి, ముమ్మనేని ప్రసాద్, పఠాన్ హయత్ ఖాన్, కోనేరు రాజేష్, షేక్ సహేరా బాను తదితరులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

78వ డివిజన్‌లో బొండా సిద్ధార్థ ఎన్నికల ప్రచారం!

34 నిమిషాల క్రితం 4,239

చంద్రాలలో టీడీపీలోకి 40 కుటుంబాలు!

41 నిమిషాల క్రితం 4,456

వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు!

55 నిమిషాల క్రితం 4,826

కూటమితోనే అభివృద్ధి.. సంక్షేమానికి భరోసా!

1 గంట క్రితం 4,870