ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ23, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

కూటమితోనే అభివృద్ధి.. సంక్షేమానికి భరోసా!

11వ డివిజన్‌లో ‘చెప్పాం.. చేస్తున్నాం’ కరపత్రం విడుదల... ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు మరెన్నో కార్యక్రమాలు అమలు చేశామన్న ఎంపీ కేశినేని శివనాథ్... విజయవాడ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్న గద్దె రామమోహన్, వంగవీటి రాధాకృష్ణ...

V10TV న్యూస్ డెస్క్ 23 అక్టోబర్, 2026 7:05 PMకి 4,870 వీక్షణలు
కూటమితోనే అభివృద్ధి.. సంక్షేమానికి భరోసా! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్‌లో నిర్వహించిన ‘చెప్పాం.. చేస్తున్నాం’ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి భాగం సాయిప్రసాద్‌తో కలిసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించే కరపత్రాన్ని విడుదల చేశారు. హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం: కేశినేని శివనాథ్ ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు చెప్పని అనేక కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేస్తున్నామని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు: గద్దె రామమోహన్ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత ఆధారంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే విజయవాడ అభివృద్ధికి ప్రాధాన్యం లభించిందని పేర్కొన్నారు. నగరాభివృద్ధికి ప్రత్యేక నిధులు: వంగవీటి రాధాకృష్ణ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. నగరంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. నగరపాలక సంస్థలోనూ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

78వ డివిజన్‌లో బొండా సిద్ధార్థ ఎన్నికల ప్రచారం!

32 నిమిషాల క్రితం 4,239

చంద్రాలలో టీడీపీలోకి 40 కుటుంబాలు!

39 నిమిషాల క్రితం 4,456

వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు!

53 నిమిషాల క్రితం 4,826

బెజవాడ తూర్పులో కూటమి ప్రచార జోరు!

59 నిమిషాల క్రితం 4,135