ప్రజాసేవలో చంటి దూకుడు
ముఖ్యమంత్రి కార్యాలయ సర్వేలో ఆరో స్థానం చంద్రబాబు ప్రశంసలు గర్వకారణమన్న ఎమ్మెల్యే ప్రజల నమ్మకమే తన విజయానికి కారణమని వెల్లడి


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
ఏలూరు, సెప్టెంబర్ 13: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తనకు ఆత్మసంతృప్తిని ఇస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కార్యాలయం నిర్వహించిన సర్వేలో ఆరో స్థానం దక్కడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ప్రశంసలు అందుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కలవకొల్లు

సాంబ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, స్థానికులు బడేటి చంటిని ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిరంతరం అందుబాటులో ఉండటమే తన విజయానికి కారణమని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి, మీడియా సమన్వయకర్త చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఫోటో రైట్‌అప్: ఎమ్మెల్యే బడేటి చంటిని సన్మానిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు.

