ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ14, సెప్టెంబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఇంటింటికీ కూటమి వైఫల్యాలు

ఈ నెల 23 నుంచి వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యక్రమం క్లస్టర్‌–5 సమావేశంలో శ్రేణులకు వెలంపల్లి దిశానిర్దేశం స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు

V10TV న్యూస్ డెస్క్ 13 సెప్టెంబర్, 2026 7:46 PMకి 2,986 వీక్షణలు
ఇంటింటికీ కూటమి వైఫల్యాలు — చిత్రం 1
ఇంటింటికీ కూటమి వైఫల్యాలు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 13: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని 49, 50, 52, 53 డివిజన్లతో కూడిన క్లస్టర్‌–5 విస్తృత స్థాయి సమావేశాన్ని ఆదివారం బ్రాహ్మణ వీధిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన’ ప్రచార పోస్టర్లను వెలంపల్లి ఆవిష్కరించారు. పార్టీలో పదవులు పొందిన నాయకులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ నెల 23 నుంచి ఇదే పేరుతో ఇంటింటి ప్రచారం చేపట్టి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు

ఇంటింటికీ కూటమి వైఫల్యాలు — అదనపు చిత్రం 2

వివరిస్తామని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని వెలంపల్లి ఆరోపించారు. నగర అభివృద్ధిని పూర్తిగా విస్మరించడంతోపాటు ‘ఆడబిడ్డ నిధి’ వంటి హామీలను అమలుచేయలేదని విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొత్త పింఛన్లతోపాటు చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు గుర్తుచేశారు. విజయవాడ సమగ్ర అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డివిజన్‌ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కూలిన గోడ..

2 గంటల క్రితం 1,250

దసరా క్యూలైన్ల పనులకు శ్రీకారం

నిన్న 1,982

ఘనంగా మహావీర్‌ జన్మ వాంచన్‌ మహోత్సవం

నిన్న 2,849

గుడివాడ గణపయ్య వచ్చాడయ్యా

నిన్న 2,769