ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ9, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

రాత్రి 10.30 దాటినా మద్యం విక్రయాలా?

గొల్లపూడి వైన్ షాప్ వద్ద అర్ధరాత్రివేళ రద్దీపై ఆరోపణలు... నిర్ణీత సమయం తర్వాత కూడా విక్రయాలంటూ స్థానికంగా చర్చ... ఎక్సైజ్ తనిఖీలు ఎక్కడంటూ ప్రశ్నలు...

V10TV న్యూస్ డెస్క్ 9 సెప్టెంబర్, 2026 11:24 AMకి 2,490 వీక్షణలు
రాత్రి 10.30 దాటినా మద్యం విక్రయాలా? — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గొల్లపూడి, విజయవాడ: ప్రభుత్వం నిర్దేశించిన మద్యం విక్రయ సమయం ముగిసిన తర్వాత కూడా గొల్లపూడిలోని ఓ వైన్ షాప్ వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. రాత్రి 10.30 గంటలు దాటిన తర్వాత కూడా షాప్ వద్ద పలువురు వ్యక్తులు ఉండటం, కౌంటర్ వద్ద లావాదేవీలు జరుగుతున్నట్లు కనిపించే దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి.

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు స్థానికంగా వైరల్ అవుతుండటంతో విషయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్ణీత సమయం తర్వాత మద్యం విక్రయాలు జరిగితే సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గొల్లపూడిలో రాత్రివేళల్లో కూడా విక్రయాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ స్పందన ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నిర్ణీత సమయం దాటిన తర్వాత నిజంగానే విక్రయాలు జరిగాయా? జరిగితే ఎవరి అనుమతితో కొనసాగాయి? సంబంధిత షాప్‌పై అధికారులు తనిఖీలు నిర్వహించారా? అన్న అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత వైన్ షాప్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మెరుగైన వైద్యం కోసం రూ.11.70 లక్షల ఎల్‌ఓసీలు

14 నిమిషాల క్రితం 0

పోలీసుల పేరుతో కొత్త సైబర్ మోసం

33 నిమిషాల క్రితం 0

వినాయక మండపాల అనుమతులకు ఈ-పోర్టల్

58 నిమిషాల క్రితం 1,254

మైలవరంలో 5 వేల కుటుంబాలకు చేరిన ‘ఇంటింటికి తెలుగుదేశం’

1 గంట క్రితం 1,655