ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ1, సెప్టెంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దసరా నాటికి ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌ పనులు పూర్తి చేయాలి

ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు క్యూ కాంప్లెక్స్‌ అనుసంధానంపై చెన్నై ప్లానర్లతో సాంకేతిక చర్చలు మహామండపం, నూతన అన్నప్రసాద సదనంలో క్షేత్రస్థాయి పరిశీలన

V10TV న్యూస్ డెస్క్ 1 సెప్టెంబర్, 2026 8:40 AMకి 1,563 వీక్షణలు
దసరా నాటికి ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌ పనులు పూర్తి చేయాలి — చిత్రం 1
దసరా నాటికి ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌ పనులు పూర్తి చేయాలి — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై నిర్మిస్తున్న ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌తోపాటు వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు. రానున్న శ్రీదేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాల నాటికి భక్తులకు పూర్తిస్థాయి వసతులు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న దేవాదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌కు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె.శీనా నాయక్‌, ప్రధాన అర్చకులు, వేదపండితులు ఘన స్వాగతం పలికారు. శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పండితులు వేదాశీర్వచనం అందజేశారు. శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను బహూకరించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ప్రతిష్ఠాత్మక ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌ పనులను ఉన్నతాధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా క్యూ కాంప్లెక్స్‌ను ప్రధాన ఆలయ మార్గంతో అనుసంధానించేందుకు చేపట్టాల్సిన నిర్మాణ

దసరా నాటికి ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌ పనులు పూర్తి చేయాలి — అదనపు చిత్రం 2

మార్పులు, సాంకేతిక అంశాలపై చెన్నై నుంచి వచ్చిన ప్లానర్ల బృందంతో సుదీర్ఘంగా చర్చించారు. మహామండపం వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో స్వయంగా నడుస్తూ నిర్మాణ తీరును పరిశీలించారు. భక్తుల రద్దీ నియంత్రణ, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, భద్రతా ప్రమాణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ప్రారంభించిన నూతన కనకదుర్గ అన్నప్రసాద సదనంతోపాటు మహామండపంలోని వివిధ విభాగాలను పరిశీలించి, భక్తులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. దసరా ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్‌ ఆదేశించారు. నాణ్యత, భద్రతా ప్రమాణాల్లో రాజీపడకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో ఆలయ ఈవో వి.కె.శీనా నాయక్‌, దేవాదాయ శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ శేఖర్‌, చెన్నై ప్లానర్ల బృందం, ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎల్‌.రమాదేవి, డీఈఈలు, ఏఈవోలు, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

గంజాయి నిర్మూలనకు ఖాకీ నిఘా

1 గంట క్రితం 1,649

గంగిరెద్దుల కులస్తుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా: విప్‌ యార్లగడ్డ

2 గంటల క్రితం 2,852

ధాన్యం అమ్మినా.. డబ్బులు రాలేదు!

17 గంటల క్రితం 1,654

శాసన మండలిలో వర్ల అనుభవం రాష్ట్రానికి ఉపయోగకరం

17 గంటల క్రితం 1,964