ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ1, సెప్టెంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

గంజాయి నిర్మూలనకు ఖాకీ నిఘా

సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో భారీ అవగాహన ర్యాలీ మత్తుకు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలని యువతకు పిలుపు గంజాయి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ

V10TV న్యూస్ డెస్క్ 1 సెప్టెంబర్, 2026 8:46 AMకి 1,649 వీక్షణలు
గంజాయి నిర్మూలనకు ఖాకీ నిఘా — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఇబ్రహీంపట్నం: మత్తుపదార్థాల రహిత సమాజమే లక్ష్యంగా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గంజాయి నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శనివారం పట్టణవ్యాప్తంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగిన ర్యాలీ ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ పోలీసులు ప్రజలు, విద్యార్థులు, యువతను ఉద్దేశించి మత్తుపదార్థాల వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ క్షణికానందం కోసం గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు బానిసలై యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మత్తుపదార్థాల వినియోగంతో ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలతోపాటు చట్టపరమైన పరిణామాలను క్షేత్రస్థాయి ఉదాహరణలతో వివరించారు. విద్యార్థులు చదువు, యువత ఉద్యోగం, కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. ఇబ్రహీంపట్నం పరిధిలో ఎక్కడైనా గంజాయి విక్రయించినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. గంజాయి రహిత ఇబ్రహీంపట్నం నిర్మాణానికి ప్రజలంతా పోలీసులతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సై సత్యవతి, పోలీసు సిబ్బంది, స్థానిక యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

దసరా నాటికి ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌ పనులు పూర్తి చేయాలి

1 గంట క్రితం 1,563

గంగిరెద్దుల కులస్తుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా: విప్‌ యార్లగడ్డ

2 గంటల క్రితం 2,852

ధాన్యం అమ్మినా.. డబ్బులు రాలేదు!

17 గంటల క్రితం 1,654

శాసన మండలిలో వర్ల అనుభవం రాష్ట్రానికి ఉపయోగకరం

17 గంటల క్రితం 1,964