సర్వాంగ సుందరంగా ముస్తాబైన జాతిపిత
ఏటూరులో గాంధీ విగ్రహానికి కొత్త శోభ దాదాపు రూ.లక్షతో అభివృద్ధి పనులు చేపట్టిన తుమ్మాటి వీరభద్రరావు విగ్రహం చుట్టూ ప్లాట్ఫామ్, ఐరన్ పైపు రైలింగ్ ఏర్పాటు


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
ఆగస్టు 14, V10TV AP: చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గ్రామస్థుల చొరవతో జాతిపిత విగ్రహానికి కొత్త శోభ వచ్చింది. గ్రామానికి చెందిన తుమ్మాటి వీరభద్రరావు ముందుకొచ్చి దాదాపు రూ.లక్ష వెచ్చించి గాంధీ విగ్రహం, పరిసరాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. విగ్రహానికి కొత్తగా రంగులు వేయించడంతో పాటు చుట్టూ సిమెంట్ ప్లాట్ఫామ్ నిర్మించి, ఐరన్ పైపులతో రైలింగ్ ఏర్పాటు

చేయించారు. దీంతో విగ్రహ ప్రాంగణం ఆకర్షణీయంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే మహాత్ముడి విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని చారిత్రక, ప్రజా ప్రాధాన్యత కలిగిన ప్రదేశాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో ముందుకు రావాలని కోరుతున్నారు. ఆగస్టు 15న నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఏటూరు గ్రామానికి వచ్చి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాలని గ్రామస్థులు ఆకాంక్షిస్తున్నారు.

