లింక్‌పై క్లిక్ చేయగానే ఖాతా ఖాళీ.. రూ.2.86 లక్షలు మాయం!
బ్యాంకు ప్రతినిధినంటూ నమ్మించి సైబర్ నేరగాళ్ల మోసం... క్రెడిట్ కార్డు KYC పేరుతో APK ఫైల్ పంపి ఇన్స్టాల్ చేయించిన వైనం... బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి విడతల వారీగా రూ.2.86 లక్షలు కట్...

విజయవాడ క్రైమ్ ఆగస్టు 20 (ఆంధ్రప్రభ): క్రెడిట్ కార్డు KYC అప్డేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు విజయవాడకు చెందిన ఓ వ్యక్తిని మోసం చేసి రూ.2.86 లక్షలు కాజేశారు. రామవరప్పాడుకు చెందిన నాగరాజుకు ఈ నెల 16న ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు.
క్రెడిట్ కార్డు KYC పూర్తి చేయాల్సి ఉందని నమ్మించిన సదరు వ్యక్తి, నాగరాజుకు APK ఫైల్ పంపి దానిని ఇన్స్టాల్ చేయాలని సూచించాడు. బ్యాంకు నుంచి వచ్చిన సమాచారమేనని భావించిన నాగరాజు ఆ ఫైల్‌ను ఇన్స్టాల్ చేసినట్లు సమాచారం.
కొద్దిసేపటి అనంతరం నాగరాజు క్రెడిట్ కార్డు నుంచి విడతల వారీగా మొత్తం రూ.2.86 లక్షలు కట్ అయినట్లు గుర్తించారు. దీంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

