వైద్యానికి భరోసా.. బాధితులకు అండ!
సుజనా చౌదరి చొరవతో రూ.7.05 లక్షల వైద్య సాయం మంజూరు... ఇద్దరు బాధితులకు సీఎం సహాయనిధి నుంచి ఎల్ఓసీలు... లబ్ధిదారుల కుటుంబాలకు పత్రాలు అందజేసిన కూటమి నేతలు...

విజయవాడ, నవంబర్ 14 : అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సాయం కోరిన రెండు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలిచింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ఇద్దరు బాధితులకు మొత్తం రూ.7.05 లక్షల విలువైన లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) మంజూరయ్యాయి. భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నాయకులతో కలిసి సంబంధిత పత్రాలను బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. 55వ డివిజన్ రాజరాజేశ్వరిపేటకు చెందిన అబ్దుల్ రహీం (47) బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికావడంతో అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం రూ.5.10 లక్షల ఎల్ఓసీ మంజూరైంది. అదేవిధంగా 45వ డివిజన్ చిట్టినగర్‌కు చెందిన షేక్ ఆషియా (41) గాల్ బ్లాడర్‌లో రాళ్ల సమస్యతో బాధపడుతుండగా, ఆమె వైద్య చికిత్స కోసం రూ.1.95 లక్షల ఎల్ఓసీ మంజూరు చేశారు. తమ విజ్ఞప్తిపై త్వరితగతిన స్పందించి వైద్య సహాయం మంజూరయ్యేలా కృషి చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు నున్న కృష్ణ, కూటమి నాయకులు దాడి అప్పారావు, దేవిన హరిప్రసాద్, వేవిన నాగరాజు, పెద్దిన శ్యామ్ సుందర్, కె. శేషారావు, గాలేటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

