స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో రత్నం నాగేశ్వరరావుకు స్థానం
మచిలీపట్నం పార్లమెంట్ – గన్నవరం నియోజకవర్గం తరఫున అవకాశం... విజయవాడ రూరల్‌లో జనసేన శ్రేణుల ఘన సత్కారం... పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యమని పిలుపు...

విజయవాడ రూరల్, సెప్టెంబరు 8: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ ఏర్పాటు చేసిన సమన్వయ సపోర్టింగ్ కమిటీలో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గన్నవరం నియోజకవర్గం తరఫున పార్టీ సీనియర్ నాయకుడు రత్నం నాగేశ్వరరావుకు స్థానం దక్కింది.
ఈ సందర్భంగా విజయవాడ రూరల్ మండల పరిధిలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు పొదిలి దుర్గారావు పిలుపునిచ్చారు. ఐక్యతతో ముందుకు సాగితే గన్నవరం నియోజకవర్గంలో జనసేనకు మరింత బలం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

