బౌద్ధ సంప్రదాయంలో సామాజిక చైతన్య వివాహం
బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఒక్కటైన రాజేష్–శ్రీవల్లి... బహుజన సేన ప్రధాన కార్యాలయం వేదికగా మంగళ పరిణయం... బౌద్ధ సంప్రదాయం ప్రకారం వివాహాన్ని జరిపించిన మత్తే బాబి...

ఏలూరు, సెప్టెంబరు 8: బహుజన సేన ప్రధాన కార్యాలయంలో బౌద్ధ సంప్రదాయం ప్రకారం సామాజిక చైతన్య వివాహం జరిగింది. బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని వరుడు గొల్ల రాజేష్, వధువు తాణింకి శ్రీవల్లి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
లార్డ్ బుద్ధ దమ్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్ మత్తే బాబి వివాహకర్తగా వ్యవహరించి బౌద్ధ సంప్రదాయ పద్ధతిలో వివాహాన్ని నిర్వహించారు. ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన రాజేష్, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన శ్రీవల్లి సామాజిక సమానత్వం, సోదరభావం ప్రతిబింబించేలా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
కులాంతర వివాహాలు సామాజిక అంతరాలను తగ్గించి సమానత్వ భావనను పెంపొందిస్తాయని, బుద్ధుని బోధనలు, అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో సమసమాజ నిర్మాణం వైపు యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. “బహుజన సేన–రేపటి తరం కోసం” అనే నినాదంతో సామాజిక చైతన్య కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

