మెగా డీఎస్సీపై కుట్రలు పనిచేయవు: సీఎం చంద్రబాబు
పారదర్శకంగా మెగా డీఎస్సీ పూర్తి చేశామన్న ముఖ్యమంత్రి... ఒక్క టీచర్ పోస్టు కూడా అమ్మలేదు.. మెరిట్‌కే పెద్దపీట వేశామని స్పష్టం... 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని అసెంబ్లీలో వెల్లడి...

అమరావతి, ఆగస్టు 17 (V10TV AP): మెగా డీఎస్సీని అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మెగా డీఎస్సీపై కుట్రలు చేయాలని వైసీపీ చూస్తోందని, అలాంటి ప్రయత్నాలు పనిచేయవని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.
గతంలో ఒక టీచర్ పోస్టు వేయలేదని విమర్శించిన చంద్రబాబు, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. లక్షలాది మంది ఉద్యోగాల కోసం ఎదురుచూసినా నియామక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా మెరిట్‌కు ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు.
ఒక్క టీచర్ పోస్టును కూడా అమ్మలేదని, నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని చంద్రబాబు స్పష్టం చేశారు. సభకు రాని వ్యక్తులు బయట ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తూ, తమపై విమర్శలు చేసే ముందు వాస్తవాలను పరిశీలించాలని సూచించారు.

