జి.కొండూరు జడ్పీటీసీ బరిలో లక్ష్మీ తిరుపతమ్మ!
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ నామినేషన్… మాజీ మంత్రి జోగి రమేష్ ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి మాజీ ఎంపీపీ… భర్త వేములకొండ తిరుపతిరావుతో కలిసి నామినేషన్ పత్రాల దాఖలు…

విజయవాడ, అక్టోబర్ 24: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండల జడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి జోగి రమేష్ ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి దిగిన ఆమె విజయవాడలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు పాల్గొన్నారు. జి.కొండూరు మండల మాజీ ఎంపీపీగా పనిచేసిన లక్ష్మీ తిరుపతమ్మ మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. జడ్పీటీసీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేయడంతో మండలంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల కార్యకలాపాలు ఊపందుకున్నాయి.

