ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ24, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గ్రామానికి పదవుల పంట.. కొటికలపూడిలో రాజకీయ సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొటికలపూడికి పెరిగిన రాజకీయ ప్రాధాన్యత… ఎంపీపీ, జడ్పీటీసీ పదవులపై ప్రధాన పార్టీల ప్రత్యేక దృష్టి… ఒకే గ్రామం నుంచి జడ్పీటీసీ బరిలో ఇద్దరు అభ్యర్థులు.. రసవత్తరంగా పోరు…

V10TV న్యూస్ డెస్క్ 24 అక్టోబర్, 2026 12:17 PMకి 3,909 వీక్షణలు
గ్రామానికి పదవుల పంట.. కొటికలపూడిలో రాజకీయ సమరం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

మైలవరం, అక్టోబర్ 24 : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొటికలపూడి గ్రామం రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. కీలకమైన ఎంపీపీ, జడ్పీటీసీ పదవులకు ప్రధాన రాజకీయ పార్టీలు ఈ గ్రామానికి చెందిన నాయకులకు అవకాశం కల్పించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి కొటికలపూడిపై పడింది. గ్రామస్థాయిలో మొదలైన రాజకీయ సందడి ఇప్పుడు మండల రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీపీ పదవికి కొటికలపూడి గ్రామానికి చెందిన పాలడుగు జ్యోత్స్నను ప్రతిపాదించగా, జడ్పీటీసీ అభ్యర్థిగా అదే గ్రామానికి చెందిన రెంటపల్లి నాగరాజును బరిలోకి దింపింది. మరోవైపు అనూహ్యంగా కూటమి కూడా కొటికలపూడి గ్రామానికే సాధారణంగా మండలంలోని వివిధ గ్రామాలకు రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత దక్కుతుంటుంది. అయితే ఈసారి కీలక పదవులకు కొటికలపూడి నుంచే అభ్యర్థులు తెరపైకి రావడం విశేషంగా మారింది. ప్రధాన పార్టీల వ్యూహాలు, స్థానిక నాయకుల ప్రభావం, సామాజిక సమీకరణాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా జడ్పీటీసీ పోరులో ఒకే గ్రామానికి చెందిన రెంటపల్లి నాగరాజు, రెంటపల్లి వెంకటేశ్వరరావు ప్రత్యర్థులుగా నిలవడంతో గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ బలం, వ్యక్తిగత పలుకుబడి, స్థానిక ప్రజల మద్దతు ఈ పోరులో కీలకంగా మారనున్నాయి. ఈ పరిణామాలతో కొటికలపూడి గ్రామం స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ కేంద్రబిందువుగా మారింది. అభ్యర్థుల గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ కీలక పదవుల పోటీలో గ్రామానికి లభించిన ప్రాధాన్యత స్థానికంగా చర్చనీయాంశమైంది. మొత్తానికి ఈసారి కొటికలపూడి కేంద్రంగా సాగనున్న రాజకీయ సమరం రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

నల్లపూసల గొలుసు చోరీ.. అనుమానితులపై పోలీసుల ఆరా!

10 నిమిషాల క్రితం 3,489

68 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలోకి వృద్ధురాలు!

15 నిమిషాల క్రితం 0

హస్తినకు సీఎం చంద్రబాబు.. ఒకరోజు ఢిల్లీ పర్యటన!

18 నిమిషాల క్రితం 3,156

పెట్రోల్ కోసం రచ్చ.. సిబ్బందిపై దాడి!

21 నిమిషాల క్రితం 3,479