విద్యార్థులతో మసాజ్.. టీచర్ సస్పెండ్
ట్రైనీ మహిళా టీచర్‌పై చర్యలు తీసుకున్న విద్యాశాఖ క్లాస్‌రూమ్‌లో విద్యార్థులతో మసాజ్ చేయించిన వీడియో వైరల్ ఘటనపై విచారణకు ఆదేశాలు.. బాధ్యులపై కఠిన చర్యలు

విజయవాడ, ఆగస్టు 5 (వి10టీవీ): విద్యార్థులతో తనకు మసాజ్ చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ ట్రైనీ మహిళా టీచర్‌ను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఏపీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్నట్లు సమాచారం.
వైరల్ అయిన వీడియోలో తరగతి గదిలో కుర్చీలో కూర్చున్న టీచర్‌కు విద్యార్థినులు తలకు, భుజాలకు మసాజ్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియోపై తీవ్ర విమర్శలు రావడంతో విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రాథమిక విచారణ చేపట్టారు.
విద్యార్థులను వ్యక్తిగత పనులకు వినియోగించడం తీవ్ర నిర్లక్ష్యంగా భావించిన అధికారులు సదరు టీచర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ వెల్లడించింది.

