ఎన్టీఆర్ జిల్లాలో మురసు తుపాను బీభత్సం!
సోమవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం… ఈదురుగాలులతో జనజీవనం అస్తవ్యస్తం.. రోడ్లపైకి వరదనీరు… అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారుల సూచనలు…

విజయవాడ, నవంబర్ 2: ఎన్టీఆర్ జిల్లాలో మురసు తుపాను ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కంచికచర్ల, వీరులపాడు, పెనుగంచిప్రోలు, నందిగామ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్లు సమాచారం. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. వాహనదారులు, ప్రయాణికులు, రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచే ప్రమాదం ఉండటంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేని ప్రాంతాల్లో వర్షపు నీరు రహదారులపై నిలిచిపోతే రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వర్షం తీవ్రంగా కురిసే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండవద్దని అధికారులు సూచిస్తున్నారు. వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు సంబంధిత శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.

