విజయవాడ దసరా నవరాత్రుల్లో ‘లడ్డూ ఏటీఎం’
▪️ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల కోసం సరికొత్త సదుపాయం ▪️ ఆన్‌లైన్‌లో బుక్ చేసి ఏటీఎం ద్వారా లడ్డూ ప్రసాదం పొందేలా ప్రణాళిక ▪️ ఆలయ పరిసరాల్లో 4 నుంచి 5 యంత్రాల ఏర్పాటుకు అధికారుల కసరత్తు

విజయవాడ: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదం మరింత సులభంగా అందేలా ఆలయ అధికారులు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భక్తులు ఆన్‌లైన్‌లో ముందుగానే లడ్డూలను బుక్ చేసుకుని, వచ్చే కోడ్‌ను ఏటీఎంలో నమోదు చేస్తే ప్రసాదం వెంటనే అందే విధానాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ఆలయ పరిసరాల్లో 4 నుంచి 5 లడ్డూ ఏటీఎంలను ఏర్పాటు చేసి, ఒక్కో యంత్రం నుంచి ఆరు లడ్డూల వరకు పొందే అవకాశం కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.

