కనకదుర్గమ్మకు అన్నవరం దేవస్థానం పట్టు వస్త్రాలు
ఈవో చక్రధరరావు ఆధ్వర్యంలో అమ్మవారికి సమర్పణ… ఆలయ బృందానికి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ స్వాగతం… దర్శనానంతరం ఆశీర్వచనం, ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేత…

విజయవాడ, అక్టోబర్ 15: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారికి అన్నవరం దేవస్థానం తరఫున గురువారం మధ్యాహ్నం పట్టు వస్త్రాలు సమర్పించారు. అన్నవరం దేవస్థానం ఈవో చక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది. అన్నవరం ఆలయ బృందానికి దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి, ఆశీర్వచనం, ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

