వైఎస్సార్సీపీ బలోపేతంపై ముఖ్య నేతల చర్చ
రామవరప్పాడులో పార్టీ ముఖ్య సమావేశం... స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై సమీక్ష... నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపు...

విజయవాడ, సెప్టెంబర్ 28: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంపై ఆ పార్టీ ముఖ్య నేతలు చర్చించారు. విజయవాడ రామవరప్పాడులో సోమవారం పార్టీ ముఖ్య సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మొగుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలకు అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలు సమీక్షించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడంతోపాటు ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీని గ్రామ, వార్డు స్థాయిలో బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

