వర్షంలోనూ వీడని విధి నిర్వహణ
సింగ్‌నగర్ డాబాకొట్లు ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సీఐ ప్రభాకర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ఏఎస్సై మురళీకృష్ణ భారీ వర్షాన్ని లెక్కచేయని నిబద్ధతకు వాహనదారుల ప్రశంసలు

విజయవాడ: నగరవ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రం కాకుండా సీఐ ప్రభాకర్ ముందస్తుగా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆయన సూచనల మేరకు సింగ్‌నగర్ డాబాకొట్లు ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ ఏఎస్సై మురళీకృష్ణ విధులు నిర్వహించారు. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ రహదారిపైనే నిలబడి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఉద్యోగులు, ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా వర్షంలో తడుస్తూనే విధులను కొనసాగించారు. సకాలంలో సిబ్బందిని సమాయత్తం చేసిన సీఐ ప్రభాకర్ పర్యవేక్షణను, ప్రతికూల వాతావరణంలోనూ బాధ్యతగా విధులు నిర్వర్తించిన ఏఎస్సై మురళీకృష్ణ నిబద్ధతను స్థానికులు, వాహనదారులు అభినందించారు.

