దుర్గమ్మకు రూ.15.50 లక్షల విలువైన కానుకలు
బంగారు పాదుకలు, పళ్లెంతో పాటు వెండి వస్తువుల సమర్పణ… కానుకలు అందజేసిన పంగులూరి శేషగిరిరావు, సునీత దంపతులు… దాతలకు అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం…

విజయవాడ, అక్టోబర్ 15: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారికి విజయవాడకు చెందిన మోడ్రన్ కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పంగులూరి శేషగిరిరావు, సునీత దంపతులు గురువారం సాయంత్రం రూ.15 లక్షల 50 వేల విలువైన కానుకలు సమర్పించారు. బంగారు పాదుకలు, బంగారు పళ్లెం, రెండు వెండి పాదుకలు, రెండు వెండి పళ్లెములను దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించి, ఆశీర్వచనం, ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందించారు.

