గన్నవరం విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం!
ఎన్టీఆర్ జిల్లా పర్యటనకు చేరుకున్న సీపీ రాధాకృష్ణన్… స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్… ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గాన విజయవాడకు పయనం…

గన్నవరం, అక్టోబర్ 26: ఎన్టీఆర్ జిల్లా పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గాన విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

