ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ22, అక్టోబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గన్నవరంలో కూటమి భారీ ర్యాలీ!

జడ్పీటీసీ అభ్యర్థిగా బీజేపీ నేత కుమారస్వామి నామినేషన్... నాలుగు దశాబ్దాల పార్టీ సేవలకు గుర్తింపు లభించిందన్న ఎమ్మెల్యే యార్లగడ్డ... గన్నవరం చరిత్రలో రికార్డు మెజారిటీ సాధిస్తామని ధీమా...

V10TV న్యూస్ డెస్క్ 22 అక్టోబర్, 2026 8:50 PMకి 2,988 వీక్షణలు
గన్నవరంలో కూటమి భారీ ర్యాలీ! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గన్నవరం మండల జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కుమారస్వామి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం గన్నవరం పట్టణంలో కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని కుమారస్వామికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న కుమారస్వామికి కూటమి తరఫున పోటీ చేసే అవకాశం రావడం సంతోషకరమన్నారు. బీజేపీ అంటే కుమారస్వామి, కుమారస్వామి అంటే బీజేపీ అనే స్థాయిలో ఆయన పార్టీ కోసం పనిచేశారని కొనియాడారు. 1995లో తొలిసారిగా ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన కుమారస్వామికి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మరోసారి ప్రజల మద్దతు కోరే అవకాశం లభించిందన్నారు. రాజకీయాల్లో సీట్ల సంఖ్య కంటే ప్రజలకు సేవ చేసే నాయకులకు అవకాశాలు కల్పించడం ముఖ్యమని యార్లగడ్డ పేర్కొన్నారు. గతంలో పొత్తుల సమీకరణాల కారణంగా కుమారస్వామికి తగిన రాజకీయ అవకాశం దక్కలేదని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు కూటమి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రికార్డు మెజారిటీపై యార్లగడ్డ ధీమా గన్నవరం మండల చరిత్రలో ఇప్పటివరకు ఏ జడ్పీటీసీ అభ్యర్థికీ రానంత మెజారిటీ కుమారస్వామికి వస్తుందనే నమ్మకం ఉందని యార్లగడ్డ ధీమా వ్యక్తం చేశారు. కుమారస్వామి విజయం ఖాయమని, ఎంత మెజారిటీ వస్తుందనేదే చూడాల్సి ఉందన్నారు. కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీ సాధించేలా కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్‌లో రాజకీయ, సామాజిక సమీకరణాలు అనుకూలిస్తే కుమారస్వామికి వైస్ చైర్మన్ పదవి కల్పించే అంశాన్ని కూడా పరిశీలించేలా ప్రయత్నిస్తానని యార్లగడ్డ వెల్లడించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు విభేదాలకు తావులేకుండా సమష్టిగా పనిచేయాలని సూచించారు. ర్యాలీలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి కుమారస్వామికి మద్దతుగా నాయకులు నినాదాలు చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కలపర్రు టోల్‌ప్లాజా వద్ద స్పెషల్ డ్రైవ్!

46 నిమిషాల క్రితం 3,701

మచిలీపట్నంలో కూటమి ప్రచార జోరు!

2 గంటల క్రితం 3,880

సింగ్‌నగర్‌లో కూటమి ప్రచార జోరు!

2 గంటల క్రితం 3,693

ప్రజాసేవే లక్ష్యం.. అభివృద్ధే ధ్యేయం!

3 గంటల క్రితం 4,874