కలపర్రు టోల్‌ప్లాజా వద్ద స్పెషల్ డ్రైవ్!
మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక తనిఖీలు... మిరుమిట్లు గొలిపే లైట్లపై రవాణా శాఖ అధికారుల నిఘా... ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో జాతీయ రహదారిపై తనిఖీలు...

ఏలూరు, అక్టోబర్ 22: రహదారి ప్రమాదాల నివారణ, వాహనదారుల భద్రతే లక్ష్యంగా ఏలూరు జిల్లా కలపర్రు టోల్‌ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశాల మేరకు డీటీసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు వాహనాలకు అమర్చిన మిరుమిట్లు గొలిపే లైట్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించడంతో పాటు ఎదురుగా వచ్చే వాహనదారుల దృష్టికి ఇబ్బంది కలిగించే అధిక కాంతి లైట్ల వినియోగాన్ని నియంత్రించడంపై అధికారులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలను తనిఖీ చేశారు. రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని ఈ ప్రత్యేక తనిఖీలు చాటిచెప్పాయి. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు సురేష్, నెహ్రూ, హైవే పోలీసు సిబ్బంది, డీటీఆర్ మధు తదితరులు పాల్గొన్నారు.

