పరుచూరి ప్రసాద్‌ను పరామర్శించిన పట్టాభిరామ్
ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ – కార్యకర్తల కష్టసుఖాల్లో పార్టీ అండగా ఉంటుందని భరోసా – త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

విజయవాడ, ఆగస్టు 31: టీ.ఎన్.టి.యూ.సీ. రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్‌ను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పరామర్శించారు. ఇటీవల కాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్న ప్రసాద్‌ను ఆదివారం ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పట్టాభిరామ్ కలిశారు. ప్రసాద్ ఆరోగ్య పరిస్థితితో పాటు శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందుతున్న వైద్యం, కోలుకుంటున్న తీరుపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యకర్తల కష్టసుఖాల్లో తనవంతు సహకారం అందించేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. పరుచూరి ప్రసాద్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజా, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.

