ఇంటింటికీ వెళ్లి.. సమస్యలు తెలుసుకుంటూ
38వ డివిజన్లో ‘ఇంటింటికి తెలుగుదేశం’ సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజలకు వివరణ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: బుద్ధా వెంకన్న



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, ఆగస్టు 30: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరవేయడమే లక్ష్యంగా ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ బుద్ధా వెంకన్న తెలిపారు. ఆదివారం పశ్చిమ నియోజకవర్గంలోని 38వ డివిజన్ కుమ్మరపాలెం సెంటర్ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న ఇంటింటికీ వెళ్లి స్థానికులతో మాట్లాడారు. వారి సమస్యలు, ప్రాంతంలో నెలకొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు


వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 38వ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని బుద్ధా వెంకన్న హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సురభి బాలు, పితాని పద్మ, కె. శివ, ఈగల సాంబా, సత్యం, ఎస్కే యూసఫ్, రంగా దుర్గా, జాహిద్, చెంచయ్య, ఎస్కే జాహిర్, ఎ. చలపతి, కె. సాంబా తదితరులు పాల్గొన్నారు.

