ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ24, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

కూటమి ప్రభుత్వంతోనే విజయవాడ అభివృద్ధి: గద్దె రామమోహన్

16వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి కిలారు నాగశ్రావణ్‌కు మద్దతుగా ప్రచారం… నగరాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడి… గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శ…

V10TV న్యూస్ డెస్క్ 24 అక్టోబర్, 2026 5:47 PMకి 4,715 వీక్షణలు
కూటమి ప్రభుత్వంతోనే విజయవాడ అభివృద్ధి: గద్దె రామమోహన్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 24: విజయవాడ నగర సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పేర్కొన్నారు. శనివారం తూర్పు నియోజకవర్గంలోని 16వ డివిజన్ శ్రీరామచంద్రనగర్ కాలనీలో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కిలారు నాగశ్రావణ్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. అనంతరం గద్దె రామమోహన్ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్లు గుర్తుచేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నగరాభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా అందించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేందుకు మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కార్పొరేటర్ అభ్యర్థి కిలారు నాగశ్రావణ్ మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో గద్దె రమేష్, యలమంచిలి పండు, రాజనాల సురేష్, గొల్లపల్లి మాధవరం, యలమందలరావు, ఉయ్యూరు మురళి, గుత్తికొండ కృష్ణమోహన్, కొడాలి శోభ, పోలవరపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

రూ.4 లక్షల కోసం ఇంటి యజమానిపై ఇనుపరాడ్డుతో దాడి!

2 గంటల క్రితం 3,569

‘చెప్పాం.. చేస్తున్నాం’ అంటూ ప్రజల్లోకి కూటమి!

4 గంటల క్రితం 4,158

నల్లపూసల గొలుసు చోరీ.. అనుమానితులపై పోలీసుల ఆరా!

6 గంటల క్రితం 3,492

68 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలోకి వృద్ధురాలు!

6 గంటల క్రితం 4