ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ24, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

‘చెప్పాం.. చేస్తున్నాం’ అంటూ ప్రజల్లోకి కూటమి!

ఎన్నికల హామీల్లో అధికశాతం అమలు చేశాం.. మిగిలినవీ త్వరలో పూర్తి చేస్తాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము… కూటమి శ్రేణుల అభిప్రాయాలతోనే అభ్యర్థుల ఎంపిక.. వందశాతం విజయమే లక్ష్యమని వెల్లడి… గుడ్లవల్లేరులో కూటమి అభ్యర్థి వర్రె బలరామకృష్ణ ఒక్కరే.. గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ అని స్పష్టీకరణ…

V10TV న్యూస్ డెస్క్ 24 అక్టోబర్, 2026 3:16 PMకి 4,158 వీక్షణలు
‘చెప్పాం.. చేస్తున్నాం’ అంటూ ప్రజల్లోకి కూటమి! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గుడివాడ, అక్టోబర్ 24: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గంలో కూటమి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ‘చెప్పాం.. చేస్తున్నాం’ పేరుతో రూపొందించిన ప్రచార కరపత్రాలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అధికశాతం అమలు చేశామని, మిగిలిన వాటిని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృషి, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి కార్యకర్తల అభిప్రాయాల మేరకు అభ్యర్థులను ఎంపిక చేశామని ఎమ్మెల్యే వివరించారు. తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నామని, ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నదే తమ అభిమతమని, నామినేషన్లు వేసే ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తామని చెప్పారు. కూటమి పార్టీల మధ్య సమన్వయంతో వందశాతం స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. గుడ్లవల్లేరులో టీడీపీ రెబల్ అభ్యర్థి నామినేషన్‌పై మీడియా ప్రశ్నించగా రాము స్పందించారు. ఈ పరిణామంపై జనసేన నాయకులకు ఇప్పటికే క్షమాపణ చెప్పానని, వారి సమన్వయానికి కృతజ్ఞతలు తెలిపారు. గుడ్లవల్లేరు జడ్పీటీసీ స్థానంలో కూటమి అధికారిక అభ్యర్థి వర్రె బలరామకృష్ణ మాత్రమేనని, గాజు గ్లాసు గుర్తుపై ఆయనకే మద్దతు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. కూటమి ఐక్యతకు విఘాతం కలిగించే చర్యలను ప్రోత్సహించబోమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ మండల అధ్యక్షులు పండ్రాజు సాంబశివరావు, వాసే మురళి, పోలవరపు వెంకట్రావు, మార్కెట్ యార్డు చైర్మన్ పొట్లూరి రవి, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

నల్లపూసల గొలుసు చోరీ.. అనుమానితులపై పోలీసుల ఆరా!

4 గంటల క్రితం 3,491

68 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలోకి వృద్ధురాలు!

4 గంటల క్రితం 2

హస్తినకు సీఎం చంద్రబాబు.. ఒకరోజు ఢిల్లీ పర్యటన!

4 గంటల క్రితం 3,158

పెట్రోల్ కోసం రచ్చ.. సిబ్బందిపై దాడి!

4 గంటల క్రితం 3,480