బలవంతపు చందాలపై పోలీసుల హెచ్చరిక
పండుగల పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి... బాధితులు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచన... ఫిర్యాదు అందిన వెంటనే నిబంధనల ప్రకారం చర్యలు: సెంట్రల్ ఏసీపీ దామోదర్...

విజయవాడ, సెప్టెంబరు 8: పండుగల సమయంలో ఎవరైనా బలవంతంగా డబ్బులు వసూలు చేసినా, వేధింపులకు గురిచేసినా వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ సూచించారు.
వేడుకలు, పండుగల పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడటం, బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే బాధితులు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని, ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడరాదని సూచించారు. బలవంతపు వసూళ్లు లేదా వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండకుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

